రాజకీయాలు.. రాజకీయంగానే ఉండాలి: నందమూరి సుహాసిని

శుక్రవారం నాటి అసెంబ్లీ వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీ నేతల వ్యాఖ్యలను టీడీపీ నేతలతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు తప్పుపడుతున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని కూడా స్పందించారు. రాజకీయాలు రాజకీయంగానే ఉండాలని నందమూరి సుహాసిని హితవు పలికారు.

Read Also: బాబాయ్ గొడ్డలిపై చర్చిద్దాం అని ఎత్తింది చంద్రబాబు : పేర్ని నాని

‘భువనేశ్వరి ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. ఎన్టీఆర్‌ను తెలుగు ప్రజలు ‘అన్నా’ అని పిలుచుకుంటారు. అలాంటి వ్యక్తి కుమార్తెపై ఇలాంటి విమర్శలు సరికాదు. కుటుంబ విషయాల జోలికి రావడం మంచిది కాదు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను తీసుకొస్తారా? రాజకీయ లబ్ధి కోసం మహిళలను కించపరిచేలా మాట్లాడతారా?’ అంటూ వైసీపీ నేతలను నిలదీశారు. మరోవైపు ఇప్పటికే చంద్రబాబు కంటతడి పెట్టడంపై నందమూరి బాలకృష్ణ, నారా రోహిత్, నందమూరి చైతన్యకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి సహా పలువురు కుటుంబసభ్యులు మాట్లాడారు. వైసీపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

Related Articles

Latest Articles