నందమూరి మోక్షజ్ఞ ఈ సారి రావడం ఖాయమా!?

ఒక్కసారి కూడా తెరపై తళుక్కుమనలేదు. అయినా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞకు అభిమానుల్లో తరిగిపోని చెరిగిపోని అభిమానం నెలకొంది. మోక్షజ్ఞ జన్మించిన 1994 సెప్టెంబర్ 6 మొదలు ఇప్పటి దాకా ఆయన ప్రతి పుట్టినరోజును అభిమానులు వేడుకగా జరుపుకుంటూనే ఉన్నారు. అదుగో ఇప్పుడు వస్తాడు… ఇదుగో వచ్చేస్తున్నాడు… అంటూ చాలా ఏళ్ళుగా మోక్షజ్ఞ తెరంగేట్రం గురించిన విశేషాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయినా ఇప్పటి దాకా మోక్షజ్ఞ ఒక్క సినిమాలోనూ నటించింది లేదు. ఏమైతేనేమి బాలకృష్ణ అభిమానులు మాత్రం మోక్షజ్ఞ పుట్టినరోజయిన సెప్టెంబర్ 6వ తేదీన ఏదో ఒక విధంగా అతని బర్త్ డే జరుపుకుంటున్నారు. 2019 దాకా ఊరూరా మోక్షజ్ఞ జన్మదినోత్సవం జరిగేది. కరోనా కారణంగా అందరూ గుమి కూడి వేడుకలు జరుపుకొనే అవకాశం లేదని గత సంవత్సరం ఎవరికి వారు తమ పరిధిలోనే మోక్షు పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సారి కూడా ఇంకా కరోనా కల్లోలం కొనసాగుతున్న నేపథ్యంలో బాలయ్య అభిమానులు తమ హీరో వారసుని పుట్టినరోజు వేడుకను మోక్షజ్ఞ దగ్గరకే వెళ్ళి జరుపుకోవడం విశేషం.

ఈ సంవత్సరంతో మోక్షజ్ఞకు 27 సంవత్సరాలు పూర్తయ్యాయి. మహానటుడు యన్టీఆర్ కు 27 ఏళ్ళ తరువాతే స్టార్ డమ్ లభించింది. అదే తీరున మోక్షజ్ఞ కూడా 27 ఏళ్ళు పూర్తయ్యాకే తెరంగేట్రం చేస్తాడని చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ యేడాదితో ఆ మైలురాయి కూడా దాటాడు మోక్షజ్ఙ. వచ్చే సంవత్సరమైనా బాలయ్య నటవారసుడు తెరపై తళుక్కుమంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. మరి తండ్రి అభిమానుల అభిలాషను మోక్షజ్ఞ ఏ మేరకు నెరవేరుస్తాడో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-