సందడే సందడి.. గుర్రం డ్యాన్స్‌.. బాలయ్య స్వారీ..

టాలీవుడ్‌ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంక్రాంతి వేడుకలు ఘనంగా చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా కారంచేడులో తన సోదరి, కేంద్రమాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఇంట్లో ఘనంగా జరుపుకుంటున్నారు.. నిన్న భోగి వేడుకల్లో సందడి చేసిన బాలయ్య.. సంక్రాంతి సందర్భంగా ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపారు.. ఇక, బాలయ్య గుర్పంపై స్వారీ అందరినీ ఆకట్టుకుంది.. గుర్రంపై బాలయ్య కూర్చొని ఉండగా.. ఆ గుర్రంతో డ్యాన్స్‌ వేయించారు.. ఓ పాటను పాడుతూ.. డ్రమ్స్‌ వాయిస్తుండగా.. లయబద్ధంగా గుర్రం స్టెప్పులు వేసింది.. ఇక, గుర్రంపై ఫుల్‌ జోష్‌తో కనిపించారు బాలయ్య.. ఓ వైపు బాలయ్యను కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తుండగా.. మరోవైపు.. అభిమానులు కూడా జై బాలయ్య.. జై జై బాలయ్య నినాదాలతో హోరెత్తించారు.. బాలయ్య సతీమణితో పాటు.. ఆయన కుమారుడు కూడా ఆనందంగా గడుపుతున్నారు. మొత్తంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి ఇల్లు.. బాలయ్య, నందమూరి కుటుంబ సభ్యుల రాకతో సంక్రాతి వేళ సందడిగా మారిపోయింది..

Read Also: కోవిడ్ దండయాత్ర.. యూఎస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

Related Articles

Latest Articles