అఖండ బర్త్ డే రోర్… బాలయ్య బర్త్ డే స్పెషల్

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ’. ఉగాది కానుకగా ఈ చిత్రం నుంచి ఏప్రిల్ 13న విడుదలైన టైటిల్ రోర్ ‘అఖండ’ వీడియో బాలయ్య కెరీర్లోనే నెవర్ బిఫోర్ రికార్డులను క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా… ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, పూర్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే జూన్ 10న నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. అయితే ఒకరోజు ముందుగానే ఆయన బర్త్ డే సెలెబ్రేషన్స్ ను మొదలు పెట్టేశారు “అఖండ” టీం. పుట్టినరోజు సందర్భంగా బాలయ్య కొత్త బర్త్ డే పోస్టర్ ను ఈ రోజు విడుదల చేశారు. ఈ పోస్టర్లో బాలయ్య లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అప్పుడే నందమూరి అభిమానులు ఈ పిక్ తో బాలయ్య బర్త్ డే సెలెబ్రేషన్స్ ను స్టార్ట్ చేసేశారు. సోషల్ మీడియాలో బాలయ్య బర్త్ డే పిక్ ను ట్రెండ్ చేసి తమ అభిమానాన్ని చాటుకోవడానికి సిద్ధమయ్యారు. ఇక ఇటీవలే బాలయ్య తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు తమ కుటుంబంతో ఆనందంగా గడపటమే తన జన్మదిన వేడుక అని, ఈ విపత్కర పరిస్థితుల్లో అభిమానులెవరూ తనను కలవడానికి రావద్దని తెలిపారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-