అఖండ: బాలయ్యకు లేదు పోటీ!

నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్ బోయపాటి శ్రీ‌ను కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’.. ఇదివరకు వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు భారీ హిట్స్ సాధించడంతో అఖండ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. కరోనా వేవ్ తర్వాత శరవేగంగా జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ చివరిదశలో ఉండగా, రెండు పాటల షూటింగ్ బ్యాలన్స్ వుంది. ప్రస్తుతం చిత్రబృందం విడుదల తేదీపై చర్చలు మొదలెట్టింది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా దీపావళి పండగకు రానున్నట్లు తెలుస్తోంది. దసరా కానుకగా ప్లాన్ చేసిన షూటింగ్ ఆలస్యం కారణంగా కుదరలేదు. దీంతో దీపావళి సమయానికి ఈ చిత్రం పక్కాగా రానున్నట్లు తెలుస్తోంది. అయితే సంక్రాంతికి తీసుకొచ్చే చర్చలు జరుగగా.. భారీ సినిమాలు పోటీలో ఉండటంతో ఆ రేసు నుంచి తప్పుకొంది. ఇక అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా కూడా డిసెంబర్ 17న రానున్నట్లు ప్రకటించింది. దీంతో బాలయ్య సినిమా దీపావళికి దాదాపు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా కూడా దీపావళి రేసులో లేకపోవడంతో బాలయ్య ‘అఖండ’ సినిమాకు ఏ భారీ సినిమా కూడా పోటీ లేనట్లు కనిపిస్తోంది. అయితే ఇంకా కావాల్సినంత సమయం ఉండటంతో ఏ సినిమా అయినా దీపావళి రేసులో ఉంటుందో, లేదో చూడాలి.

-Advertisement-అఖండ: బాలయ్యకు లేదు పోటీ!

Related Articles

Latest Articles