మహేష్ బాబు యాడ్ షూట్ షేర్ చేసిన నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. విదేశీ ప్రయాణాలు మొదలు, ఫ్యామిలీ మూమెంట్స్ అన్ని అభిమానులతో షేర్ చేసుకుంటారు. పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పిన నమ్రత.. భర్త, పిల్లలకు అండగా నిలుస్తూ వస్తోంది. ప్రస్తుతం వారి ప్రపంచమే.. ఆమె ప్రపంచం అన్నట్లుగా మారింది. తాజాగా మహేష్ బాబు పాల్గొన్న ఓ యాడ్ షూటింగ్ కి వెళ్లిన నమ్రత అక్కడి షూటింగ్ ను తన కెమెరాలో బంధించి, ఇన్ స్టా రీల్ లో పోస్ట్ చేసింది.

కాగా, నేడు మహేష్ బాబు – నమ్రత కుమారుడు గౌతమ్ కృష్ణ తన 15వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు, నమ్రతలు గౌతమ్‌కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక మరో వైపు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా కూడా సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. గౌతమ్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘వన్ నేనోక్కడినే’ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గౌతమ్ చిన్ననాటి మహేష్ పాత్రలో నటించారు.

View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Related Articles

Latest Articles

-Advertisement-