బ్రేకింగ్ : ఈ ఏడాది నాంపల్లి నుమయిష్ పూర్తిగా రద్దు..

కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. గత నెల మొదటి వారంలో దేశవ్యాప్తంగా 9 వేల లోపు నమోదైన కరోనా కేసులు, తాజాగా ఒక్కరోజులోనే 90వేలకు పైగా నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న నాంపల్లి నుమాయిష్‌ ఈ ఏడాది పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్‌ సొసైటీ ప్రకటించింది.

కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సొసైటీ ప్రతినిధులు వెల్లడించారు. జనవరి1న ప్రారంభమైన నుమాయిష్‌ జనవరి 2న తాత్కాలికంగా 10 రోజులు మూసేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం కరోనా కేసులు పెరిగిపోతుండడంతో తాజాగా ఈ ఏడాది నుమాయిష్ ని నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారు.

Related Articles

Latest Articles