డ్రగ్స్‌ కేసు… కెల్విన్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

సంచలనంగా మారిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఉన్న కెల్విన్‌కు నాంప్లి కోర్టు సమన్లు జారీ చేసింది.. అయితే, ఈ సమన్లు బోయిన్‌పల్లి కేసులో జారీ అయ్యాయి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కెల్విన్‌ను 2016లో బోయిన్‌పల్లిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్‌ చేవారు.. అతడి దగ్గర ఎల్ఎస్‌డీ రకం డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల వివరాలతో 2016 ఆగస్టులో కెల్విన్‌పై బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సీసీఎస్‌లోని నార్కోటిక్స్ విభాగానికి కేసు బదిలీ అవ్వడం.. పూర్తిస్థాయిలో విచారణ జరపకపోవడం.. సకాలంలో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేకపోవడంతో బెయిల్‌పై బయటకు వచ్చేశాడు.. ఇక, మళ్లీ 2016లోనే ఎక్సైజ్ పోలీసులు కెల్విన్‌ను మరోసారి అరెస్ట్ చేశారు.. ఈ విచారణ సమయంలోనే తీగ లాగితే డొంక కదిలినట్టు.. టాలీవుడ్ డ్రగ్స్‌ వ్యవమారం బయటపడింది.. సినీ ప్రముఖుల పేర్లను తెరపైకి తెచ్చింది. అయితే బోయిన్‌పల్లి కేసులో సీసీఎస్‌లోని నార్కోటిక్స్ విభాగం.. తాజాగా నాంపల్లి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయడం.. ఆ ఛార్జ్‌సీట్‌ను నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించడం జరిగిపోయాయి.. దీంతో.. ఈ నెల 11వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కెల్విన్‌కు సమన్లు జారీ చేసింది నాంపల్లి కోర్టు.

మరోవైపు టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో రంగంలోకి దిగిన ఈడీ.. ఇప్పటికే పూరీ జగన్నాథ్, చార్మీ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ప్రశ్నించగా.. ఇవాళ నందును కూడా విచారణకు పిలిచింది.. ఇదే సమయంలో.. కెల్విన్‌ను కూడా ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు అధికారులు.. 8 గంటలకు పైగా కెల్విన్‌ను ప్రశ్నిస్తున్నారు.. విచారణలో కెల్విన్ నుంచి కీలకమైన అంశాలను రాబట్టినట్టుగా తెలుస్తోంది.. టాలీవుడ్ నటులకు డ్రగ్స్ సరఫరా వ్యవహారం.. కెల్విన్ బ్యాంకు అకౌంట్ కు పెద్ద మొత్తంలో నిధుల బదలాయింపుపై ప్రశ్నిస్తున్నారు.. కెల్విన్ అకౌంట్లోకి పెద్ద మొత్తంలో నిధులు వచ్చినట్లుగా గుర్తించిన ఈడీ.. 30 అకౌంట్ల ద్వారా కెల్విన్ బ్యాంక్ ఖాతాలోకి నిధులు వచ్చినట్టుగా చెబుతున్నారు.. కెల్విన్ ఇంటి నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్టు కూడా స్వాధీనం చేసుకున్న అధికారులు.. కెల్విన్ కు రెండు బ్యాంకు అకౌంట్లు ఉన్నట్లుగా గుర్తించారు.. ఇక, ఈ కేసులో కెల్విన్‌ను అరెస్ట్‌ చేసే అవకాశం కూడా ఉందంటున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-