బాలిక‌పై లైంగిక దాడి కేసు… నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

కొత్త కొత్త చట్టాలు వచ్చినా.. కఠిన శిక్షలు పడుతున్నా… చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఆడవారిపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో సంచలన తీర్పు వెలువరించింది నాంపల్లి కోర్టు… ఈ కేసులో హోంగార్డ్‌కు 30 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో తుకరాంగేట్‌లో ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేశారు మల్లికార్జున్‌ అనే హోం గార్డు.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫిబ్రవరి 19న హోంగార్డ్‌ను అరెస్ట్ చేవారు.. బాలిక గర్భం దాల్చడంతో మెడికల్ రిపోర్ట్ నుండి ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్ వరకు అన్ని ఆధారాలు సేకరించి కోర్టులో సమర్పించారు.. ఈ కేసులో విచారణ జరిపిన నాంపల్లి కోర్టు… నిందితుడికి 30 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.. జైలు శిక్షతో పాటు రూ.40,000 బాధితురాలి కుటుంబానికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-