రెండో ‘పిశాచి’తో తిరిగి వస్తోన్న తమిళ దర్శకుడు!

ఇప్పుడు ఏ సినిమా రంగంలో చూసినా సీక్వెల్స్ జోరు నడుస్తోంది. ఒక్క సినిమా హిట్టైతే చాలు దానికి సీక్వెల్స్ అంటూ వీలైనన్ని మూవీస్ ని వండి వడ్డించేస్తున్నారు. తమిళంలోనూ సేమ్ ట్రెండ్ సాగుతోంది…
థ్రిల్లర్ మూవీస్ తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే డిఫరెంట్ డైరెక్టర్ మిస్కిన్. ఆయన గత చిత్రం ఉదయనిధి స్టాలిన్ నటించిన ‘సైకో’. నిత్యా మీనన్, అదితి రావ్ హైదరీ హీరోయిన్స్ గా కనిపించారు. అయితే, ‘సైకో’ మూవీకి మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. అందుకే, నెక్ట్స్… ఆల్రెడీ హిట్టైన తన హారర్ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు మిస్కిన్. ‘పిసాసు’ సినిమా పార్ట్ టూ రాబోతోంది…

‘పిసాసు 2’లో యాండ్రియా ప్రధాన పాత్రలో కనిపించనుంది. అయితే, మరో సౌత్ బ్యూటీ నమితా కృష్ణమూర్తి కూడా సినిమాలో నటించనుందట. ఈ విషయం ఆమే స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో తెలిపింది. ఓ నెటిజన్ ప్రశ్నకు బదులు ఇస్తూ తన నెక్ట్స్ మూవీ ‘పిసాసు 2’ అని చెప్పింది. యాండ్రియా, నమితా స్టారర్ హారర్ సీక్వెల్ పై ఇంకా మిస్కిన్ ఎలాంటి అనౌన్స్ మెంట్స్ చేయలేదు. చూడాలి మరి, షూట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో. సినిమా ఎప్పుడు మన ముందుకు వస్తుందో! మిస్కిన్ సినిమాలు తెలుగులోకి డబ్ కావటం, ఇక్కడ కూడా మంచి స్పందన రావటం రెగ్యులర్ గా జరిగేదే…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-