చంద్రబాబుకి అక్కడ 60వేల మెజారిటీ గ్యారంటీ

పెద్దిరెడ్డికి పదవి, డబ్బు వచ్చిందనే అహంకారంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. చంద్రబాబు 14ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారు. అయ్యప్ప మాల ధరించిన పెద్దిరెడ్డి చంద్రబాబుపై సంస్కారహీనంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదన్నారు.

సుదీర్ఘ కాలం సీఎంగా చేసిన చంద్రబాబుపై ఎప్పుడూ భూకబ్జా ఆరోపణలు రాలేదు. ఇప్పుడు వైసీపీ హయాంలో చిత్తూరు జిల్లాలో భూదందాలు, ఇసుక దందాలే. దందాలు చేసి సంపాదించిన డబ్బుతో కుప్పంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచారు. వైసీపీ నాయకులే తంబళ్లపల్లి, మదనపల్లిలో భూ ఆక్రమణలు జరిగాయని ఆరోపిస్తున్నారు. పెద్దిరెడ్డిపై ఆరోపణలు చేసిన వైసీపీ నాయకుడు ఇప్పుడు జైలులో ఉన్నాడన్నారు.

పెద్దిరెడ్డి తన రాజకీయ జీవితంలో నాలుగుసార్లు ఓడిపోయారు. కుప్పంలో డబ్బు పంచి వైసీపీని గెలిపించిన పెద్దరెడ్డి ఆకాశంలో నుండి ఊడిపడినట్లు మాట్లాడుతున్నారు. అవినీతి డబ్బుతో పెద్దిరెడ్డి కుటుంబానికి కళ్లు నెత్తికెక్కాయి. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పుట్టడం దురదృష్టమా? భూకబ్జాదారులైన పెద్దిరెడ్డి పుట్టడం దురదృష్టమా? చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే పెద్దిరెడ్డి కుటుంబం ఎక్కడుండేది. చంద్రబాబు కుప్పంలోనే పోటీ చేసి 50, 60 వేల మెజారిటీతో గెలుస్తారన్నారు కిషోర్ కుమార్ రెడ్డి.

Related Articles

Latest Articles