‘బంగార్రాజు’ కు ముహూర్తం కుదిరింది!

అక్కినేని నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకి ప్రిక్వెల్‌గా ‘బంగార్రాజు’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నాడు. నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ కనిపించనున్నారు. ఇక నాగచైతన్య పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. చైతు పాత్రకి జోడీగా కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా షూటింగ్ ఆగస్టు మూడో వారం నుంచి చిత్రీకరణ షురూ చేయనున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ సెట్‌ కూడా వేస్తున్నారు. గ్రామీణ వాతావరణంలోనే ఈ కథ నడవనుంది. సంక్రాంతికి ఈ సినిమా తీసుకురావాలని నాగ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-