సినిమా టికెట్ రేట్స్ ఇష్యూపై నేను మాట్లాడను.. అడగొద్దు- నాగార్జున

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచేశారు. ఈ నేపథ్యంలోనే నేడు బంగార్రాజు చిత్ర బృందం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ని నిర్వహిస్తోంది.

ఇక ఈ సమావేశంలో ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూ గురించి నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూ జరుగుతోంది కదా.. దాని గురించి మీరేమంటారు అని రిపోర్టర్ అడగగా.. ” సినిమా స్టేజిపై పొలిటికల్ న్యూస్ మాట్లాడకూడదు.. నేను మాట్లాడను.. అయినా టికెట్స్ రేట్స్ వలన నా సినిమాకి అయితే ఇబ్బంది లేదు.. మిగిలినవారి సంగతి నాకు తెలియదు” అని నాగ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నాగ్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related Articles

Latest Articles