అదొక్కటే బాధ… మ్యూజికల్ నైట్ లో నాగార్జున

అక్కినేని నాగార్జున తన సూపర్ హిట్ చిత్రం “సోగ్గాడే చిన్ని నాయన”కు సీక్వెల్ గా “బంగార్రాజు” చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జునతో కలిసి నాగ చైతన్య స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. రమ్యకృష్ణ, కృతిశెట్టి తదితరులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ చిత్రానికి దర్శకుడు. నిన్న ఈ చిత్రానికి సంబంధించి జరిగిన మ్యూజికల్ నైట్ ఈవెంట్ లో ఆడియో ఆల్బమ్ వేడుకను చిత్ర యూనిట్ జరుపుకుంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “ప్రస్తుతం నేను ఫీల్ అవుతున్న ఏకైక బాధ ఏమిటంటే… మేము అభిమానులను ఈ వేడుకకు ఆహ్వానించలేకపోయాము. ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం అనుమతి లభిస్తే గ్రాండ్‌గా జరుపుకుందాం’ అని నాగార్జున ఇక సినిమా జనవరి 14న విడుదలకు సిద్ధంగా ఉండగా, జనవరి 11న ‘బంగార్రాజు’ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు నాగార్జున. ఆయన ఇంకా ఏం మాట్లాడారో వీడియోలో చూడండి.

Read Also : హృతిక్ మ్యాజిక్ మళ్ళీ సాగేనా!?

Related Articles

Latest Articles