ఫారిన్ షెడ్యూల్ వద్దంటున్న నాగ్ ?

కింగ్ నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్లపై నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. జబర్దస్త్ బ్యూటీ రష్మీ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రవీణ్ సత్తారుతో నాగ్ సినిమా అయిపోయింది అంటూ వార్తలు రాగా… ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సెకండ్ షెడ్యూల్ జూన్ ఫస్ట్ వీక్ నుంచి ప్రారంభం కానుంది అని ప్రకటించి రూమర్లకు చెక్ పెట్టారు మేకర్స్. కాగా ఈ సినిమాలో అధిక భాగాన్ని విదేశాలలో చిత్రీకరించాలని ముందుగా అనుకున్నారు మేకర్స్. కానీ కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో విదేశీ షెడ్యూల్‌ను రద్దు చేయాలని నాగార్జున మేకర్స్ కు సూచించారని తెలుస్తోంది. దానికి ప్రత్యామ్నాయంగా అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ కోసం ప్రత్యేక సెట్లు వేయమని మేకర్స్‌ను కోరారు. నిర్మాతలు త్వరలో ఆ భారీ సెట్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారట. షూటింగులకు అనుమతి లభించగానే అన్నపూర్ణ స్టూడియోలో నిర్మించే సెట్లో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం కానుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-