నాగార్జున సాగర్ జలాశయానికి పోటెత్తిన వరద

నాగార్జున సాగర్ జలాశయానికి నాలుగు రోజుల నుంచి వరద పోటెత్తుతోంది. వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో ఐదు లక్షల ముప్పై వేల క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తోంది. నాగార్జున సాగర్ డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 569 అడుగులకు చేరుకుంది.పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా…ప్రస్తుతం 233 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. మరో 48 గంటల్లో జలాశయం గరిష్ట నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏ క్షణాన్నైనా డ్యామ్ క్రస్ట్ గేట్లు ఎత్తేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. గేట్ల మరమ్మతులు పూర్తి చేశారు. క్రస్ట్ గేట్లు ఎత్తేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డ్యామ్ SE ధర్మా నాయక్ తెలిపారు.

Related Articles

Latest Articles