నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కొనసాగుతున్న వరద

భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం నాగార్జున సాగర్‌కు కొనసాగుతోంది. ఇప్పటికే రెండు క్రస్ట్ గేట్లను అధికారుల ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 64.000క్యూసెక్కులు ఉండా, అవుట్ ఫ్లో కూడా 64.000క్యూసెక్కులు ఉంది. అయితే పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిలువ 311.7462 టీఎంసీలుగా ఉంది.

ఇదిలా ఉంటే శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 20,953 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ ఫ్లో 73,618 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 880.90 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు, ప్రస్తుత 192.9694 టీఎంసీలుగా ఉంది. దీంతోపాటు కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Related Articles

Latest Articles