అది వారి వ్య‌క్తిగ‌తం… ఇద్ద‌రూ నాకిష్ట‌మే…

నాగ‌చైత‌న్య‌- సమంత‌లు విడిపోతున్న‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు.  ఈ ప్ర‌క‌ట‌నతో టాలీవుడ్ ప‌రిశ్ర‌మ ఒక్క‌సారిగా షాక్ అయింది.  నాగ చైత‌న్య – స‌మంత విడిపోవ‌డంపై అక్కినేని నాగార్జున విచారం వ్య‌క్తం చేశారు. స‌మంత – నాగ చైత‌న్య‌లు విడిపోవ‌డం దుర‌దృష్ట‌కరం అని, భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ఏం జ‌రిగినా అది వారి వ్య‌క్తిగ‌తం అని, ఇద్ద‌రూ త‌న‌కెంతో ద‌గ్గ‌రివారని, స‌మంత‌తో త‌న కుటుంబం గ‌డిపిన ప్ర‌తి క్ష‌ణం ఎంతో మ‌ధుర‌మైన‌ద‌ని, దేవుడు ఇద్ద‌రికీ మ‌నో ధైర్యాన్ని ఇవ్వాల‌ని ప్రార్థిస్తున్న‌ట్టు నాగార్జున ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు.  వారికి త‌న ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయ‌ని నాగార్జున పేర్కొన్నారు.  

Read: తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌స్తే మొద‌టి సంత‌కం దానిమీదే…

-Advertisement-అది వారి వ్య‌క్తిగ‌తం... ఇద్ద‌రూ నాకిష్ట‌మే...

Related Articles

Latest Articles