అందుకే చిరుతో పాటు జగన్ భేటీకి వెళ్లలేదు- నాగార్జున

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం సినిమాటికెట్ రేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై టాలీవుడ్ అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయమై మాట్లాడడానికి నేడు మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ వెళ్లారు. సినిమా పరిశ్రమ తరపున చిరంజీవి, ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు చిరు తో పాటు టాలీవుడ్ పెద్ద నాగార్జున ఎందుకు వెళ్ళలేదు అనే ప్రశ్న తలెత్తింది. అయితే తాజగా ఈ ఈ ప్రశ్నపై నాగ్ స్పందించారు. జగన్ నుంచి తనకు ఆహ్వానం అందిందని, తాను కూడా చిరుతో వెళ్లాల్సి ఉందని కానీ ప్రస్తుతం తాను ‘బంగార్రాజు’ ప్రమోషన్స్ లో ఉన్నట్లు తెలిపారు. ఆ కారణం చేతే తాను మీటింగ్ కి వెళ్లలేదని తెలిపారు. సీఎం జగన్‌తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. అంతా మంచే జరుగుతుందని నాగార్జున చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై కూడా నెటిజన్లు నాగ్ ని విమర్శిస్తున్నారు. టాలీవుడ్ మొత్తం కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్క సినిమా ప్రమోషన్ కోసం ఆగడం పద్దతి కాదని, నాగార్జున కూడా వెళ్లి ఉంటె ఇంకాస్త ఎక్కువగా జగన్ తో మాట్లాడే అవకాశం దొరికేదని అభిప్రాయపడుతున్నారు.

Related Articles

Latest Articles