మైసూరుకు చేరుకున్న “బంగార్రాజు”

అక్కినేని తండ్రీకొడుకులు నాగార్జున, నాగచైతన్యల క్రేజీ మల్టీస్టారర్ “బంగార్రాజు” షూటింగ్ ఆగస్టు 20న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. తాజా అప్‌డేట్ ఏమిటంటే చిత్ర బృందం మేజర్ సెకండ్ షెడ్యూల్ కోసం కర్ణాటకలోని మైసూర్‌లో అడుగు పెట్టింది. నాగ్, చై ఇద్దరిపై ఈ షెడ్యూల్ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం.

Read Also : సెప్టెంబర్ 10 నుంచి “ఖిలాడీ” మ్యూజిక్ ఫెస్టివల్

“బంగార్రాజు”లో తన కుమారుడు నాగ చైతన్యతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. “మనం” తర్వాత తండ్రీ కొడుకులు ఒకే స్క్రీన్ పై కన్పించడం ఇది రెండోసారి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ, నాగ చైతన్య, కృతి శెట్టి ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. 2016లో నాగార్జున నటించిన “సోగ్గాడే చిన్ని నాయన” సినిమాకి “బంగార్రాజు” ప్రీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇందులో రమ్య కృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు. ప్రీక్వెల్ “బంగార్రాజు”లో నాగ చైతన్య ప్రేయసిగా కృతి శెట్టి నటించనుంది. దర్శనా బానిక్, అక్షత సోనావానే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చనున్నారు. ఈ చిత్రాన్ని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి.

Related Articles

Latest Articles

-Advertisement-