“ఏజెంట్”లో నాగ్… దర్శకుడి షాకింగ్ రియాక్షన్

అఖిల్ అక్కినేని కెరీర్‌లో “ఏజెంట్” అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సినిమాలో అఖిల్ కు తండ్రిగా, గురువుగా మమ్ముట్టి నటించబోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలోని కీలకపాత్రలో నాగార్జున నటించాలని అనుకున్నారట. కానీ సురేందర్ రెడ్డి ఆయన ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదట. దానికి కారణం ఏంటో కూడా చెప్పాడట.

Read Also : అనుష్క సినిమా ఆగిపోయిందా ?

విషయంలోకి వెళ్తే.. నాగార్జునకు సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ ను వివరిస్తున్నప్పుడు అందులోని కీలకపాత్ర బాగా నచ్చిందట. ఆ పాత్రలో తానే నటించాలని నిర్ణయించుకుని దర్శకుడితో అదే మాట అన్నారట. కానీ సురేందర్ రెడ్డి ఈ విషయాన్ని సున్నితంగా తిరస్కరించాడట. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ లో నాగ్ భాగమైతే మల్టీస్టారర్ అవుతుంది. అంతేకాకుండా అందరూ దీన్ని నాగ్ చిత్రంగానే చూస్తారు తప్ప అఖిల్ చిత్రంగా కాదు. అదే విషయాన్ని సురేందర్ రెడ్డి నాగ్ కు వివరించారట. దీంతో కన్విన్స్ అయిన నాగ్ దర్శకుడితో కలిసి ఆ పాత్ర కోసం మమ్ముట్టిని ఒప్పించారట. ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న “ఏజెంట్” వచ్చే ఏడాది విడుదల కానుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-