అఖిల్ కోసం కొర‌టాల శివను రంగంలోకి దించ‌నున్న నాగ్!

హీరోగా అఖిల్ న‌టించిన తొలి మూడు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని అందించ‌లేదు. మ్యూజిక‌ల్ గా ఆ సినిమాలు కాస్తంత గుర్తింపు తెచ్చినా కాసుల వ‌ర్షం కురిపించ‌లేదు. ఈ నేప‌థ్యంలో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌కత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్పైనే అఖిల్, అక్కినేని ఫ్యాన్స్ ఆశ‌లు పెట్టుకున్నారు. ఇదే స‌మ‌యంలో టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి సైతం ఏజెంట్గా యాక్ష‌న్, థ్రిల్ల‌ర్ మూవీతో అఖిల్ ను కొత్త‌గాచూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు మీద అఖిల్ ఫాద‌ర్ నాగార్జున‌కు కాస్తంత న‌మ్మ‌కం ఉన్నా… ఎందుకైనా మంచిద‌ని ఇప్పుడు కొర‌టాల శివ‌తో మంత‌నాలు జ‌రుపుతున్నార‌ట‌. అఖిల్ ను దృష్టిలో ఉంచుకుని మంచి క‌థ త‌యారు చేస్తే, తానే నిర్మించే ఆలోచ‌న‌లో నాగ్ ఉన్నార‌ట‌. నాగార్జున కోరిక‌ను దృష్టిలో ఉంచుకునే యంగ్ హీరో అఖిల్ కోసం కొర‌టాల ఓ క‌థ‌ను త‌యారు చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం కొర‌టాల శివ చేస్తున్న ఆచార్య‌ మూవీ క‌రోనా కార‌ణంగా ఆగిపోయింది. అలానే దీని త‌ర్వాత వెంట‌నే జూనియ‌ర్ ఎన్టీయార్ తో శివ మూవీ చేయాల్సి ఉంది. సో… ఇవి అయిన త‌ర్వాతే అఖిల్ తో కొర‌టాల శివ మూవీ చేసే ఛాన్స్ ఉంది. ఏదేమైనా… కొర‌టాల శివ త‌న‌దైన శైలిలోనే అఖిల్ తోనూ సినిమా చేస్తాడ‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే… వీరిద్ద‌రి కాంబినేష‌న్ కూడా క్రేజ్ ను సంపాదించు కుంటుంద‌న‌డంలో సందేహం లేదు!

Related Articles

Latest Articles

-Advertisement-