‘బంగార్రాజు’ సెన్సార్ రిపోర్ట్…. రన్‌టైమ్ ఎంతంటే…?

ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న పెద్ద సినిమా ఏదైనా ఉందంటే అది నాగార్జున, నాగచైతన్య నటించిన ‘బంగార్రాజు’ మాత్రమే. కరోనా కారణంగా సంక్రాంతి రేసు నుంచి ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్ సినిమాలు తప్పుకోవడంతో ‘బంగార్రాజు’కు అనుకోకుండా కలిసొచ్చింది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు ఈ మూవీ ప్రీక్వెల్‌గా వస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా రెండు గంటల నలభై నిమిషాల నిడివితో రానుంది. ఈ చిత్రంలో నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించగా… నాగచైతన్య సరసన కృతిశెట్టి కనిపించనుంది.

Read Also: ‘అనురాగదేవత’కు నేటితో 40 ఏళ్లు

సంక్రాంతికి పర్‌ఫెక్ట్ మూవీ బంగార్రాజు అని టాక్ నడుస్తోంది. సెన్సార్ బోర్డు నుంచి కూడా ఈ మూవీకి ప్రశంసలు వచ్చినట్లు తెలుస్తోంది. సినిమా అంతా సరదాగా సాగిపోతుందని… పండక్కి ఫ్యామిలీతో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చని సమాచారం. నాగార్జున, నాగచైతన్య మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ అలరిస్తాయని.. ఈ మూవీకి హైలెట్‌గా నిలుస్తాయని విశ్లేషకులు చెప్తున్నారు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ వర్కవుట్ అయితే సినిమా రేంజ్ పెరుగుతుందని అంటున్నారు. సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలయ్యే ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ రాబడుతుందో వేచి చూడాలి.

'బంగార్రాజు' సెన్సార్ రిపోర్ట్.... రన్‌టైమ్ ఎంతంటే...?

Related Articles

Latest Articles