మ్యూజికల్ నైట్ లో హీరోయిన్ తో కలిసి దుమ్మురేపిన నాగ్, చై

నిన్న రాత్రి జరిగిన “బంగార్రాజు” మ్యూజికల్ నైట్ లో అక్కినేని తండ్రీకొడుకులు కలిసి దుమ్మురేపేశారు. అనూప్ రూబెన్స్ రిక్వెస్ట్ తో నాగార్జున, నాగ చైతన్య, కృతి శెట్టి కలిసి సంక్రాంతి పండగ ఎలా ఉండబోతుందో ఈ వేదికపై చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ స్టార్స్ ముగ్గురినీ స్టేజిపైకి పిలిచి మ్యాజిక్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. దానికి ఒప్పుకున్న నాగ్, చైలకు తోడుగా కృతి శెట్టిని కూడా పిలిచాడు అనూప్. ఇక ఈ ట్యాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సమక్షంలో చై స్టిక్ తో, కృతి శెట్టి గాజులతో, నాగార్జున విజిల్ తో ‘మ్యూజికల్ నైట్’ స్టేజ్ దద్దరిల్లిపోయింది. ‘బంగార్రాజు’ సాంగ్స్ అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ ఈవెంట్ ను నిర్వహించారు.

Read Also : ‘బంగార్రాజు’ ట్రైలర్ అప్డేట్… రివీల్ చేసేసిన నాగ్

Related Articles

Latest Articles