ప్రియాంకకు నాగ్ కొత్త బిరుదు!

బిగ్ బాస్ సీజన్ 5 కౌంట్ డౌన్ మొదలైపోయింది. టాప్ ఫైవ్ లో ఉండాలని కోరుకున్న ప్రియాంక ఈ వీకెండ్ లో హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఆదివారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో ఎలిమినేషన్స్ లో చివరికి ప్రియాంక, సిరి నిలిచారు. అందులో అదృష్టం సిరిని వరించడంతో ప్రియాంక బిగ్ బాస్ సీజన్ 5 కు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. బిగ్ బాస్ లో ప్రియాంక మొత్తం పదమూడు వారాలు ఉంది. ఇంతకాలం బిగ్ బాస్ లోని ఇంటి సభ్యులందరికీ చక్కని వంటలు చేసి పెట్టి, ‘అన్నపూర్ణ’ అనిపించుకుంది పింకీ. అయితే చిత్రంగా హౌస్ నుండి బయటకు రాగానే ప్రియాంకకు నాగార్జున ఓ కొత్త బిరుదిచ్చేశాడు.

Read Also : ర్యాపిడోకి కోర్టులో ఎదురుదెబ్బ

‘డాక్టర్ ప్రియాంక సింగ్’ అని సంభోదించాడు. ఐస్ వాటర్ లో కాళ్ళు పెట్టే టాస్క్ లో తీవ్రంగా గాయపడిన సిరి, శ్రీరామ్ లకు ప్రియాంక మంచి ఉద్దేశ్యంతోనే సలహాలు ఇచ్చి, సేవ చేసింది. కానీ ఆమె సొంత బుర్రతో చేసిన చిట్కాలు శ్రీరామ్ విషయంలో వికటించి, అతని గాయాన్ని మరింతగా పెంచాయి. దాంతో కొద్ది రోజులుగా శ్రీరామ్ సరిగా నడవలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుండీ ప్రియాంక ఆరోగ్యానికి సంబంధించిన ఏ సలహా చెప్పినా, ఇంటి సభ్యులు దానిని పాటించడానికి ఒకటి రెండు సార్లు ఆలోచించే స్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో నాగార్జున, ప్రియాంకను ‘డాక్టర్’ అని సంభోదించగానే, పింకీ… ‘సార్ దయచేసి అలా పిలవకండీ… ఇక బయట అందరూ నన్ను అలానే పిలిచి ఆడుకుంటారేమో’ అని వాపోయింది. మొత్తం మీద బిగ్ బాస్ హౌస్ లోకి మామూలుగా వెళ్ళిన ప్రియాంక ‘డాక్టర్’ అనే బిరుదుతో తిరిగొచ్చిందని అనుకోవచ్చు!

Related Articles

Latest Articles