‘వరుడు కావలెను’ వాయిదా పడిందా..?

నాగశౌర్య – రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’.. దసరా కానుకగా అక్టోబర్ 15న రానుంది. అయితే తాజాగా ఈ చిత్రం దసరా రేసు నుంచి తప్పుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ పండక్కి పెద్ద సినిమాలు లేకున్నా.. మిగితా సినిమాల క్యూ ఎక్కువే అవ్వడంతో వరుడు కావలెను వాయిదా పడినట్లుగా తెలుస్తోంది.

మహాసముద్రం సినిమా అక్టోబర్ 14న, అక్టోబర్ 15న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లిసందD సినిమాలు రానున్నాయి. దీంతో వరుడు కావలెను నవంబర్ మొదటివారంలో రానుందనే టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే సితార టీమ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

-Advertisement-‘వరుడు కావలెను’ వాయిదా పడిందా..?

Related Articles

Latest Articles