‘థాంక్యూ’ ఫస్ట్ లుక్ : అల్ట్రా స్టైలిష్ లుక్ లో నాగ చైతన్య..

అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇటీవల లవ్ స్టోరీ తో హిట్ అందుకున్న చై.. మరోసారి హిట్ కొట్టడానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే తండ్రి నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది కాకుండా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘మనం’ చిత్రం తరువాత విక్రమ్- చైతన్య కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

ఇక నేడు నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా ఈ చైతూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ చెప్పారు. పోస్టర్ లో చైతూ లుక్ ఆకట్టుకొంటుంది. అల్ట్రా స్టైలిష్ డ్రెస్ లో కూల్ గ్లాసెస్ తో క్లాస్ గా కనిపించాడు. రంగుల రాట్నంలోని గుర్రం బొమ్మపై కూర్చొని చిన్నపిల్లాడిలా నవ్వులు చిందిస్తున్న చైతన్య పోస్టర్ నెట్టింట వైరల్ మారింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో చైతూ సరసన రాశీఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

Latest Articles