“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అన్నయ్యే స్పెషల్ గెస్ట్ గా!

యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈసారి అఖిల్ సినిమా వేడుకకు స్వయంగా తన అన్నయ్య అక్కినేని నాగ చైతన్య అతిథిగా వస్తుండడం విశేషం. ఈ మేరకు మేకర్స్ ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ ప్రీ రిలీజ్ వేడుక వివరాలను వెల్లడించారు. అక్టోబర్ 8న సాయంత్రం 6 గంటలకు, జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు నాగ చైతన్యను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. ఇటీవలే నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన “లవ్ స్టోరీ” ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మరి చై ఈ వేడుకకు రావడం హిట్ కోసం తపిస్తున్న అఖిల్ కు ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.

Read Also : ‘నెపోటిజం’పై రానా స్పందన

కాగా “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో అఖిల్ హర్ష అనే ఎన్ఆర్ఐ పాత్రలో, పూజా హెగ్డే మాత్రం విభా అనే స్టాండర్డ్ కమెడియన్ పాత్రలో నటించబోతోంది. ఈషా రెబ్బ, మురళి శర్మ, వెన్నెల కిషోర్, జయప్రకాష్, ప్రగతి, ఆమని లాంటి నటీనటులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జిఎ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

-Advertisement-"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" అన్నయ్యే స్పెషల్ గెస్ట్ గా!

Related Articles

Latest Articles