సినిమాలను తెలుగు ప్రేక్షకుల్లా ఎవరు ఆదరించలేదు : చైతన్య

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన “లవ్ స్టోరీ” సెప్టెంబర్ 24న విడుదల అయిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాను సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వచించారు. అయితే ఈ సినిమాను అభిమానాలు ఎంతగానో ఆదరించడంతో ఈరోజు లవ్ స్టోరీ మ్యాజికల్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఇందులో హీరో నాగ చైతన్య మాట్లాడుతూ… ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అని చాలా ఎదురు చూసాను. ఎట్టకేలకు గత 24న ఈ సినిమా విడుదల అయ్యింది. అయితే మన దేశంలో కరోనా లాక్ డౌన్ తర్వాత చాలా సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ఇక్కడ మన తెలుగు ప్రజలు ఆదరించిన విధంగా దేశంలో ఎక్కడ సినిమాలను ఆదరించలేదు అని నాగ చైతన్య అన్నాడు. ఈ కరోనా సమయంలో థియేటర్ కు వస్తారా.. లేదా అనుకున్న సమయంలో దీనిని ఇంత పెద్ద హిట్ చేసినందుకు అభిమానులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ముల నుంచి తాను చాలా నేర్చుకున్నానని.. ఆయనతో ఇంకా సినిమాలు చేయాలనీ అనుకుంటున్నాను అని చైతన్య తెలిపాడు.

-Advertisement-సినిమాలను తెలుగు ప్రేక్షకుల్లా ఎవరు ఆదరించలేదు : చైతన్య

Related Articles

Latest Articles