‘బంగార్రాజు’ నిజంగా పండగలాంటి సినిమా- నాగ చైతన్య

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రంబంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే నేడు హైదేరాబద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం. ఈ వేడుకలో నాగ చైతన్య మాట్లాడుతూ” దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నన్ను రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంతో మీ అందరికీ శివగా చాలా దగ్గర చేశారు. ఆ సినిమాలో బ్రేకప్ సీన్ లో ఎంతటి ఎనర్జీ ఉంటుందో.. బంగార్రాజు చిత్రంలోని ప్రతి సీన్ లో అంతే ఎనర్జీ ఉంటుంది. నాన్న అందరికి ఇది పండగ లాంటి సినిమా.. పండగ లాంటి సినిమా అని చెప్తున్నారు.. నిజంగా ఏది ఒక పండగలాంటి సినిమా.

సంక్రాంతికి, తెలుగు అభిమానులకు ఒక విడదీయలేని అనుభందం ఉంది. ఈ సినిమా మీకు పండగను గుర్తుచేస్తోంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా దానువాదాలు తెలుపుకొంటున్నాము. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు నాన్నను ఒకే మాట అడిగాను.. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? అని.. ఆయన ఎటువంటి సందేహం లేకుండా పండగ నాడు పండగ సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పారు. దీంతో నాకు నమ్మకం వచ్చింది. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్లు రమ్యకృష్ణ గారికి, కృతి శెట్టి, దక్ష నగార్కర్, ఫరియా అబ్దుల్లా అందరు చాలా బాగా చేశారు. మాకోసం ఎప్పుడు వచ్చే అభిమానులు థియేటర్ కి వెళ్లి, వచ్చేటప్పుడు హ్యాపీగా వస్తారు. అందరు థియేటర్ కి వెళ్లి సినిమా చూసి ఆనదించండి” అని చెప్పుకొచ్చారు.

Related Articles

Latest Articles