‘డోంట్ మ్యారీ… బీ హ్యాపీ’… నాగ చైతన్య ఫుల్ చిల్

సమంత నుండి విడిపోయినప్పటి నుండి అందరి దృష్టి అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యపైనే ఉంది. విడాకుల తర్వాత ఈ ఇద్దరి గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా వైరల్ అవుతోంది. రీసెంట్ గా నటి దక్ష నాగార్కర్‌ చిలిపి చేష్టలకు నాగ చైతన్య సిగ్గుపడుతూ కన్పించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా అయ్యింది. ఈ వీడియోలో ఇంకా ట్రెండ్ అవుతుండగానే తాజాగా చైతన్య ‘డోంట్ మ్యారీ… బీ హ్యాపీ’ అంటూ సాంగ్ పాడిన మరో వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా సందడి చేస్తోంది.

Read Also : త్రిష హెల్త్ అప్డేట్… బ్యూటిఫుల్ పిక్ తో గుడ్ న్యూస్

నాగ చైతన్య ప్రస్తుతం “బంగార్రాజు” ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఓ ప్రముఖ ఛానల్ లోని షోలో పాల్గొన్నాడు. ఆయనతో పాటు నాగార్జున, కృతి శెట్టి కూడా ఈ స్పెషల్ షోకు హాజరయ్యారు. అయితే తాజాగా విడుదలైన ఈ సంక్రాంతి స్పెషల్ షో ప్రోమోలో నాగ చైతన్య ఫుల్ చిల్ అవుతూ కన్పించాడు. ఈ వీడియోలో నాగ చైతన్య తన తండ్రి నాగార్జున సూపర్ హిట్ చిత్రం ‘మన్మథుడు’లోని ‘ఒద్దురా సోదరా’ పాటను పాడడాన్ని మనం చూడవచ్చు. ఆయన ఇంకా కొన్ని పాటలు పాడినప్పటికీ విడాకుల నేపథ్యంలో ‘డోంట్ మ్యారీ… బీ హ్యాపీ’ అంటూ నాగ చైతన్య నోటి నుంచి రావడంతో ఈ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఇక “బంగార్రాజు”లో నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Related Articles

Latest Articles