కాశ్మీర్ మంచు కొండల్లో… ఓ విడిపోయిన బాలీవుడ్ జంట, మన నాగ చైతన్య!

జమ్మూ, కాశ్మీర్ లోని లదాఖ్ మంచు పర్వతాల్లో నాగ చైతన్య షూటింగ్ చేస్తున్నాడు! ఈ విషయాన్ని స్వయంగా సొషల్ మీడియాలో ప్రకటించిన ‘చే’ ఆమీర్ ఖాన్, కిరణ్ రావ్ తో కలసి తాను దిగిన ఫోటోని షేర్ కూడా చేశాడు!

మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ పూర్తి చేసే పనిలో పడ్డాడు. అందుకే, లదాఖ్ లో ఓ షెడ్యూల్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. సినిమాలో ‘బాలా’ అనే పాత్ర పోషిస్తున్న మన చైతూ కూడా చిత్ర యూనిట్ తో జాయిన్ అయ్యాడు. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతోన్న ‘లాల్ సింగ్ చద్దా’తో నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం…
అక్కినేని స్టార్ పోస్ట్ చేసిన లదాఖ్ షూటింగ్ లోని పిక్ ఇప్పుడు బీ-టౌన్ లోనూ చర్చగా మారింది. ఎందుకంటే, కొన్ని రోజుల క్రితమే ఆమీర్, కిరణ్ రావ్ పరస్పర అంగీకారంతో తాము విడిపోతున్నట్టు ప్రకటించారు. కానీ, తాజా ఫోటోలో మాజీ భార్యాభర్తలు కూడా ఉన్నారు! దాంతో బాలీవుడ్ లో ఆమీర్, కిరణ్ రావ్ పోస్ట్ బ్రేకప్ రిలేషన్ షిప్ పై జోరుగా చర్చ సాగుతోంది!

‘లాల్ సింగ్ చద్దా’ కాకుండా నెక్ట్స్ ‘లవ్ స్టోరీ’, ‘థాంక్యూ’ చిత్రాల్లో కనిపించనున్నాడు నాగ చైతన్య. ‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో సమంత బీ-టౌన్ లో గ్రాండ్ సక్సెస్ సాధించింది. చైతూకి కూడా అలాంటి శుభారంభమే లభించాలని మనమూ కోరుకుందాం!

కాశ్మీర్ మంచు కొండల్లో… ఓ విడిపోయిన బాలీవుడ్ జంట, మన నాగ చైతన్య!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-