24న ‘లవ్ స్టోరీ’ రిలీజ్

తెలుగు చిత్రపరిశ్రమలో పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నటించిన ‘లవ్ స్టోరీ’ ఒకటి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాకి కొత్త రిలీజ్ డేట్ వచ్చింది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సెప్టెంబర్ 24న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిజానికి వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఆ రోజున నాని నటించిన ‘టక్ జగదీష్‌’ ఓటీటీలో విడుదల కావటంతో తమ సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు ‘లవ్ స్టోరీ’ దర్శకనిర్మాతలు. అయితే ఈ సారి ఆరు నూరైనా సెప్టెంబర్ 24న రావటం ఖాయం అంటున్నారు. ఈ చిత్రానికి పవన్ సి హెచ్ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, అమిగోస్ సినిమాస్ నిర్మించాయి. ఇప్పటికే ఈ సినిమా పాటలు పలు మ్యూజిక్ ఛార్ట్ లలో చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు దర్శకనిర్మాతలు.

24న 'లవ్ స్టోరీ' రిలీజ్

Related Articles

Latest Articles

-Advertisement-