ఈ నెలలోనే శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’!

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లవ్ స్టోరీ’.. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లు తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ లోనే రిలీజ్‌ కావాల్సివుండగా కరోనా సెకండ్ వేవ్ తో వాయిదా పడింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు రీ-ఓపెన్ కానున్న నేపథ్యంలో విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే చాలా చోట్ల థియేటర్లు ముస్తాబు అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ‘లవ్ స్టోరీ’ ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అతిత్వరలోనే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టనున్నారని సమాచారం. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ‘సారంగధరియా’ సాంగ్ పాత రికార్డులన్నీ తిరగరాసింది. ఈ సినిమాకి దగ్గరగా టక్ జగదీష్, విరాటపర్వం, నారప్ప సినిమాలు రానున్నట్లుగా తెలుస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-