అమీర్ మూవీలో తన పాత్ర రివీల్ చేసిన చై!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌తో నాగ చైతన్య “లాల్ సింగ్ చద్దా”లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. చైతూకు హిందీలో ఇదే మొదటి చిత్రం. ప్రస్తుతం లడఖ్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం నాగ చైతన్య భారీ డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది. దాదాపు 20 రోజుల పాటు సినిమా షూటింగ్ జరగనుంది.

Read Also : ‘ఓరేయ్, చంపేస్తా… పారిపో…’ అంటూ వారెంట్ ఇచ్చిన సిద్ధార్థ్!

తాజాగా ఈ సినిమా సెట్స్ లో టీంతో కలిసి దిగిన పిక్ ను నాగ చైతన్య తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. అందులో “గ్రేట్ ఫుల్ # బాలా # లాల్” అని శీర్షిక పెట్టాడు. అయితే ఈ పోస్ట్ చూస్తుంటే నాగ చైతన్య ఈ చిత్రంలో బాలా అనే పాత్రలో కన్పించబోతున్నాడు అన్పిస్తోంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. “ఫారెస్ట్ గంప్” రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2019 మార్చి 14 న అధికారికంగా ప్రకటించారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా షూటింగ్ 2020లో ఆగిపోయింది. మళ్ళీ ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-