అలవోకగా టార్గెట్ మార్క్‌ను అందుకున్న ‘లవ్ స్టోరీ’

సెన్సిటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ చిత్రం వసూళ్ళలో దూసుకుపోతోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి వేరే ఏ చిత్రం పోటీలో లేకపోవడంతో ఈ వారం రోజుల్లో వసూళ్ల సునామీ సృష్టించింది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాకి.. ఆలస్యం అమృతంలా పనిచేసిందనే చెప్పాలి. పాటలు, ట్రైలర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు ఏర్పడంతో థియేటర్లోనూ అలరిస్తోంది. ఓపెనింగ్స్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టుకోగా.. మరోవైపు యూఎస్ లోను ఏకంగా 1 మిలియన్ డాలర్స్ కు పైగానే వసూలు చేసినట్టు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ. 31 కోట్లు మేర జరిగినట్టు తెలుస్తోంది. దీంతో రూ. 32 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగిన ఈ సినిమా ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ ను దాటేస్తుందని ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ ను బట్టి అంచనా వేస్తున్నారు. అయితే రేపు మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ సినిమా విడుదల అవుతుండగా.. ‘లవ్ స్టోరీ’ కలెక్షన్స్ పై ఏమైనా ప్రభావం చూపిస్తాయేమో చూడాలి.

-Advertisement-అలవోకగా టార్గెట్ మార్క్‌ను అందుకున్న ‘లవ్ స్టోరీ’

Related Articles

Latest Articles