రెండు ప్రాపర్టీలపై నాగ చైతన్య భారీ పెట్టుబడులు

యంగ్ హీరో నాగ చైతన్య విడాకుల విషయంతో గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. నాగ చైతన్య, సమంతల బ్రేకప్ వార్తలు వారి అభిమానులను తీవ్ర షాక్‌కు గురి చేశాయి. విడాకుల విషయాన్నీ అధికారికంగా ప్రకటించిన తరువాత వారు ఇద్దరూ పనిలో పనైపోయారు. ప్రస్తుతం వారి నెక్స్ట్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా నాగ చైతన్య భారీ బడ్జెట్ తో రెండు ప్రాపెర్టీలపై భారీ పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది.

Read Also : మా అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం

నాగ చైతన్య గచ్చిబౌలిలోని పాష్ ఏరియాలో ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. సామ్ తో విడిపోయాక చైతన్య బయటకు వచ్చాడు. తాజాగా ఆయన రెండు కొత్త ప్రాపర్టీలపై భారీగా పెట్టుబడి పెట్టాడని అంటున్నారు. నాగ చైతన్య జూబ్లీహిల్స్‌లోని ఓ ఏరియాలో బంగ్లాను కొన్నాడు. ప్రస్తుతం కొత్త బంగ్లా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గచ్చిబౌలి సమీపంలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో నాగ చైతన్య కొత్త అపార్ట్‌మెంట్‌ను కూడా కొనుగోలు చేసాడు. ఆయన త్వరలోనే ఇక్కడికి మారబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఆస్తుల కోసం చైతన్య భారీగా ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ‘థాంక్యూ’ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే చైతన్య ‘బంగార్రాజు’ సినిమా షూటింగ్ కు వెళ్తాడు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది థియేట్రికల్ విడుదల కానున్నాయి.

-Advertisement-రెండు ప్రాపర్టీలపై నాగ చైతన్య భారీ పెట్టుబడులు

Related Articles

Latest Articles