అతీంద్రియ శక్తులతో నాగచైతన్య హారర్ సీరీస్

అక్కినేని హీరో నాగచైతన్య డిజిటల్ ఎంట్రీ ఖరారు అయింది. అయితే తొలి యత్నంలో చై ఓ హారర్ సినిమా చేయబోతున్నాడు. ఇందులో అతీంద్రీయ శక్తులు ప్రధానాశంగా ఉండబోతున్నాయట. ఈ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ నిర్మించనుంది. దీనికి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం విక్రమ్, నాగ చైతన్య ‘థాంక్యూ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే విక్రమ్ ఈ హారర్ సిరీస్‌ని సెట్స్‌పైకి తీసుకువెళతాడట. వినవస్తున్న సమాచారం ప్రకారం ఈ సీరీస్ అతీంద్రియ శక్తులు ప్రధానాంశంగా తెరకెక్కబోతోంది. ఇందులో తమిళ నటి ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించనుంది. అంతే కాదు పలువురు దక్షిణాది నటీనటులు నటించనున్నారు. జనవరి 2022లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ సిరీస్‌లో తన పాత్ర కోసం నాగచైతన్య మేక్ఓవర్ అవబోతున్నాడట. చై నటించే తొలి హారర్‌ చిత్రమిది‌. పలు భాషల్లో ప్రీమియర్ కానున్న ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Related Articles

Latest Articles