దసరా బుల్లోడిగా దిగిపోయిన ‘బంగార్రాజు’ కొడుకు

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం బంగార్రాజు.. సోగ్గాడు మళ్లీ వచ్చాడు అనేది ట్యాగ్ లైన్. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్ సరసన రమ్య కృష్ణ నటిస్తుండగా.. చై సరసన కృతి శెట్టి నటిస్తోంది.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కృతి శెట్టి లుక్ ని రివీల్ చేయగా.. తాజాగా నాగ చైతన్య లుక్ ని రివీల్ చేశారు. అంతేకాకుండా నవంబర్ 23 చైతూ బర్త్ డే సందర్బంగా టీజర్ ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఇక పోస్టర్ లో చైతూ లుక్ అదిరిపోయింది. పూల చొక్కా.. నల్ల కళ్లద్దాలు.. పక్కనే ఎగరేసిన కర్ర.. మొత్తానికి పండగకు సిద్దమైన దసరా బుల్లోడులా కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఇటీవల ఈ సినిమా నుంచి లడ్డుందా సాంగ్ మారు మ్రోగిపోయిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాతో ఈ తండ్రి కొడుకులు మరోసారి హిట్ ని అందుకుంటారేమో చూడాలి.

Related Articles

Latest Articles