చై, సామ్ కల తీరబోతోంది !

స్టార్ జంట నాగ చైతన్య, సమంత కల త్వరలోనే నెరవేరబోతోంది. గోవా ఈ దంపతులకు ఇష్టమైన హాలిడే స్పాట్. వీరిద్దరూ గోవాలోనే వివాహం చేసుకున్నారు. సమయం దొరికినప్పుడల్లా సమంత, చైతన్య గోవాలో పార్టీ చేసుకుంటారు. వీళ్ళిద్దరూ గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు చాలాసార్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందనే. అయితే కొంతకాలం నుంచి చైతు, సామ్ గోవాలో విలాసవంతమైన బీచ్ హౌజ్ కోసం వెతుకుతున్నారట. తాజాగా వీరికి తాము కలలుగన్న డ్రీమ్ ప్లేస్ దొరికిందట. ఇటీవల ఫామ్‌హౌస్ నిర్మాణాన్ని కూడా ప్రారంభించారని సమాచారం. ఇది వచ్చే ఏడాదికి సిద్ధమవుతుందని భావిస్తున్నారు.

Read Also : యూట్యూబ్ యాంకర్ కు “ఎక్స్ ట్రా జబర్దస్త్” ఆఫర్

మరోవైపు సామ్, చై వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. సమంత వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ : సీజన్ 2″తో బాలీవుడ్ తో పాటు పాన్-ఇండియన్ అరంగేట్రం చేయగా, చైతన్య అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చద్దా”తో బిటౌన్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. నాగ చైతన్య వచ్చే నెలలో విక్రమ్ కుమార్ “థాంక్యూ” మూవీ షూట్‌ను తిరిగి ప్రారంభిస్తాడు. సమంత “శాకుంతలం” చిత్రీకరణ పూర్తయింది. ఇది వచ్చే ఏడాది థియేట్రికల్ రిలీజ్‌ కానుంది.

Related Articles

Latest Articles