ఏపీలో జనసేననే ప్రతిపక్ష పార్టీ : నాదెండ్ల మనోహర్‌

అమరావతి : జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జనసేననే ప్రతిపక్ష పార్టీ అని… స్వప్రయోజనాల కోసం ప్రధాని మోడీని పవన్‌ కలవలేదన్నారు నాదెండ్ల మనోహర్‌. ఇతర ప్రతిపక్షాల గురించి మనకు అనవసరం.. తామే ప్రతిపక్షమన్నారు. ఇసుక, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, స్థానిక సంస్థల ఎన్నికల అరాచకాల విషయంలో గట్టిగా పోరాడింది జనసేనేనని… జగన్ ఇంట్లో కూర్చొని పరిపాలన చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.
కోవిడ్ సందర్భంలో ఒక్క చోటైనా సీఎం జగన్ పర్యటించారా..? ఒక్క ఆస్పత్రినైనా సందర్శించారా..? ప్రశ్నిస్తున్నాం కాబట్టే జనసేనపై దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. స్థానిక ఎన్నికల్లో జనసేన బలం అర్ధమయ్యేలా చేశామని… ప్రభుత్వం చేసే వ్యక్తిగత దాడిని జనసైనికులు తిప్పి కొడతారని హెచ్చరించారు. దాడులు చేయడం ద్వారా 2019 తరహాలో గెలవాలని భావిస్తోంది ప్రభుత్వమని.. క్షేత్ర స్థాయిలో జనసేన బలపడిందని వెల్లడించారు.రాష్ట్ర సమస్యలపై బీజేపీతో ఎన్నటికీ రాజీ పడేదే లేదని తేల్చి చెప్పారు నాదెండ్ల మనోహర్.

-Advertisement-ఏపీలో జనసేననే ప్రతిపక్ష పార్టీ : నాదెండ్ల మనోహర్‌

Related Articles

Latest Articles