జనసేన ప్రభుత్వం వస్తే.. ఇసుక ఉచితంగా ఇస్తుంది : నాదెండ్ల మనోహర్

చెరుకుపల్లి ప్రజసభలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… జనసైనికుల బలం ఈ సభతో రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుస్తోంది. జనసేన రాజకీయ ప్రస్థానం.. పదవుల కోసం కాదు ప్రజాసేవ కోసం అన్నారు. అకాల వర్షాలు వరదల తో రాష్ట్రం లో రైతులు అల్లాడిపోతున్నారు. రాష్ట్రం లో రైతు భరోసా కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేశారో ప్రభుత్వం చెప్పాలి. 70 శాతం ప్రజలు రైతాంగం పై ఆధారపడి ఉన్నారు. జీవో 217 తీసుకువచ్చి మత్స కార కుటుంబాలలో చిచ్చు పెట్టింది ఈ ప్రభుత్వం అని తెలిపారు.

అలాగే గతంలో రెండు వేలు రేటు ఉన్న ఇసుక ఈ రోజు 8వేల రేటుకు చేరింది. లంచాలు మరిగి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇవ్వాలి అన్న ఆయన… రాబోయే ప్రభుత్వం జనసేనది.. అప్పుడు ఉచితంగా ఇసుక ఇస్తుంది అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి స్పందించే మనసు లేదు. పెన్షన్ ఇచ్చేటప్పుడు వాలంటీర్స్ రెండు వందలు లంచం తీసుకుని పెన్షన్ లు ఇస్తున్నారు. ముప్పై సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న ఇళ్లకు ఒన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో పేదలను దోచుకోవడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు.

Related Articles

Latest Articles