ఈటల కన్నా ముందు సంజయ్ తరుణ్ చుగ్ తో సమావేశం అయిన నడ్డా

ఈటలతో భేటీ కన్నా ముందు సంజయ్ తరుణ్ చుగ్ లతో సమావేశం అయ్యారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్ర పరిస్థితిలపై ఆరా తీశారు. తెలంగాణ ఉద్యమ కారులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని మరో సారి నడ్డా దృష్టికి తీసుకెళ్లారు సంజయ్. ఉద్యమ కారులకు మనం అండగా ఉండాలని కోరిన సంజయ్.. ఈటల పై కావాలనే ఆరోపణలు చేసి ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పారు బీజేపీ నేతలు. ఈటలతో పాటు ఇంకా ఇబ్బంది పడుతున్న ఉద్యమ కారులు ఎవరు ఉన్నారని అడిగిన నడ్డా… ఆ తర్వాత ఈటలతో సమావేశం అయ్యారు. ఉద్యమ కారులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే నని చెప్పిన నడ్డా.. మీ లాంటి వారు పార్టీ లోకి రావడం తో ఆ పని మరింత సులభం అవ్వుతుందని ఈటల తో నడ్డా అన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-