చార్లీ చాప్లిన్ గా నభా నటేశ్

టాలీవుడ్ లో స్టార్ డమ్ వైపు అడుగులు వేస్తున్న తారామణుల్లో నభా నటేష్ ఒకరు. సినిమా సినిమాకి తనని తాను మెరుగుపరుచుకుంటూ గ్లామర్ వెదజల్లుతున్న హీరోయిన్ నభా. ఇక నభా సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ వాటిని తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ అప్ డేట్స్ ఇస్తూ కొనసాగుతోంది. ఎప్పుడూ గ్లామర్ షూట్స్ చేసే నభా తాజాగా ఓ సరదా ఫోటో షూట్ చేసింది. అందులో నభా చార్లీ చాప్లిన్‌ అవతారాల్లో కనిపించటం విశేషం. ఇటీవల ఓటీటీలో విడుదలైన నితిన్ ‘మాస్ట్రో’లో నటించింది నభా నటేశ్. అయితే అందులో తనకి తగినంత ప్రాధాన్యత లభించలేదు. అందుకేనేమో ఇప్పుడు ఇలా ఫన్నీగా చార్లీ చాప్లిన్ అవతారంలో హల్ చల్ చేస్తోంది. ఇప్పుడీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన ఎవరైనా దర్శకనిర్మాతలు నభాకి తమ సినిమాలలో చార్లీచాప్లిన్ వేషం ఇస్తారేమో చూడాలి.

చార్లీ చాప్లిన్ గా నభా నటేశ్
చార్లీ చాప్లిన్ గా నభా నటేశ్
చార్లీ చాప్లిన్ గా నభా నటేశ్
చార్లీ చాప్లిన్ గా నభా నటేశ్
-Advertisement-చార్లీ చాప్లిన్ గా నభా నటేశ్

Related Articles

Latest Articles