మహేశ్ – త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ దొరికేసింది!

సూపర్ స్టార్ మహేష్ బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. అయితే మరో కథానాయికకు కూడా ఛాన్స్ ఉండటంతో నభా నటేష్ నటించనుందని తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ ప్రస్తుతం నితిన్ మాస్ట్రో సినిమాలో నటిస్తోంది. ఇక త్రివిక్రమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ కి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తక్కువ టైమ్ లోనే ఈ బ్యూటీకి మహేశ్-త్రివిక్రమ్ వంటి స్టార్ సినిమాలో నటించే అవకాశం రావడమంటే ఖచ్చితంగా ఆమె కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!

ప్రస్తుతం మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరో షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం కనిపిస్తోంది.. మరోవైపు త్రివిక్రమ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా సినిమా ‘భీమ్లా నాయక్’ సినిమాను పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా దగ్గర పడటంతో త్వరలోనే మహేష్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మొదలుకానుంది.

Related Articles

Latest Articles

-Advertisement-