“నా కోసం మారావా నువ్వు”… “బంగార్రాజు” సోల్ ఫుల్ మెలోడీ

కింగ్ నాగార్జున, నాగ చైతన్య కలిసి చేస్తున్న సోషియో-ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “బంగార్రాజు”. ఈ చిత్రం నుండి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘నా కోసం’ సాంగ్ ఎట్టకేలకు విడుదలైంది. సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఈ మధురమైన సంగీతాన్ని అందించడంతో ఈ సోల్ ఫుల్ మెలోడీ వీక్షకులకు మరింత అద్భుతంగా అన్పిస్తోంది. ఈ సాంగ్ లో నాగ చైతన్య హీరోయిన్ పై ప్రేమ కోసం వికసించిన తన భావాలను వ్యక్తం చేస్తున్నాడు. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా యంగ్ బ్యూటీ కృతి శెట్టి నటించారు. ఈ పాటలో చై, కృతి కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. స్వరకర్త అనూప్ రూబెన్స్ ఈ సాంగ్ కోసం చక్కటి ట్యూన్‌ అందించగా, గీత రచయిత బాలాజీ ఆకట్టుకునే సాహిత్యాన్ని రాశారు.

Read Also : తమిళ తంబీలకు దగ్గరయ్యే ప్రయత్నంలో బన్నీ

నాగార్జున సరసన రమ్యకృష్ణ కూడా నటిస్తోంది. బంగార్రాజు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ బ్యానర్‌తో కలిసి నాగ్ అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి ప్రీక్వెల్ అన్న విషయం తెలిసిందే.

Related Articles

Latest Articles