“101 జిల్లాల అందగాడు” నుంచి పెప్పీ అండ్ ఎనర్జిటిక్ సాంగ్

అవసరాల శ్రీనివాస్, రుహాని శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ “101 జిల్లాల అందగాడు”. తాజాగా ఈ చిత్రం నుంచి పెప్పీ అండ్ ఎనర్జిటిక్ సాంగ్ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహించారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతం సమకూర్చారు. శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్విసి ఎఫ్ఎఫ్ఈ బ్యానర్‌ల కింద దిల్ రాజు, క్రిష్ సమర్పిస్తున్నారు. 3 సెప్టెంబర్ 2021న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా సినిమా ప్రమోషన్లలో వేగం పెంచేశారు.

Read Also : ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’ ట్రైలర్

ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. అందులో బట్టతల వల్ల వచ్చే ప్రాబ్లెమ్స్ ను ఆసక్తికరంగా చూపించారు. తాజాగా ఈ సినిమా నుంచి పెప్పీ అండ్ ఎనర్జిటిక్ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. “నా గర్ల్ ఫ్రెండు” అంటూ సాగుతున్న ఈ వీడియో సాంగ్ ను అనుదీప్ దేవ్ పాడారు. భాస్కరభట్ల సాహిత్యం అందించారు. అందరినీ ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.

Related Articles

Latest Articles

-Advertisement-