వచ్చే సంక్రాంతి మనదే- దిల్ రాజు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ కాంబోలో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. ఇకపోతే ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ల వలన చరణ్ షూటింగ్ ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ వాయిదా పడడంతో చెర్రీ వెంటనే శంకర్ షూటింగ్ లో పాల్గొననున్నాడు.

కాగా.. ఈ సినిమాపై ఒక క్రేజీ అప్డేట్ ని దిల్ రాజు అభిమానులతో పంచుకున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమాను దింపుతున్నట్లు ఆయన ప్రకటించారు. సంక్రాంతి 2023 లో శంకర్- చరణ్ కాంబో అంటే మామూలు విషయం కాదు. ఇక సంక్రాంతి రేసులో చెర్రీ ఉన్నాడంటే హిట్టు పక్కా అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఈ సంక్రాంతి మనది కాకపోయినా వచ్చే సంక్రాంతి మనదే అని దిల్ రాజు తెలిపారు. దీంతో ఇప్పటినుంచే అభిమాను వచ్చే సంక్రాంతి కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు.

Related Articles

Latest Articles