విజయ్ దేవరకొండ, శివనిర్వాణతో మైత్రీ సినిమా

ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమా ‘లైగర్’తో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత విజయ్ చేయబోయే సినిమాలేవీ అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే ‘నిన్ను కోరి’, ‘మజిలి’ ‘టక్ జగదీశ్’ సినిమాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. శివ దర్శకత్వం వహించిన ‘టక్ జగదీశ్’ ఈ నెల 10న డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల కాబోతోంది. విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ కలయిక లో రూపొందే సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించబోతోంది. గతంలో విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ సినిమాను నిర్మించిందీ సంస్థ.

ప్రస్తుతం మైత్రీ సంస్థ మహేశ్ తో ‘సర్కారు వారి పాట’, బన్నీతో ‘పుష్ప’, నానితో ‘అంటే సుందరానికి’, పవన్ కళ్యాణ్, హరీవ్ శంకర్ సినిమా, బాలకృష్ణ, గోపీచంద్ మలినేనితో ఓ సినిమాను నిర్మిస్తోంది. ఇవి కాకుండా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్, ప్రభాస్ తో ఓ సినిమా కూడా కమిట్ అయింది. విజయ్ దేవరకొండతో తీయబోయే సినిమాను ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్నట్లు సమాచారం. టాలీవుడ్ లో మోస్ట్ బిజియెస్ట్ నిర్మాణ సంస్థగా ముందుకు సాగుతున్న ఈ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలతో ఏ స్థాయి విజయాలను అందుకుంటుందో చూడాలి.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-