గోదావరిలో లభ్యమైన మూడు మృతదేహాల కేసులో వీడిన మిస్టరీ…

రాజమండ్రి ఇసుక ర్యాంప్ వద్ద ఈ నెల 1న గోదావరిలో లభ్యమైన మూడు మృతదేహాల కేసులో మిస్టరీ వీడింది. సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెళ్లెల్లు, తమ్ముడు. తమ తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురై గోదావరిలో దూకి అత్మహత్య చేసుకున్నారు కుమార్తెలు, కుమారుడు. మృతులు ప.గో.జిల్లా కొవ్వూరు బాపూజీనగర్ కు చెందిన అక్క మామిడిపల్లి కన్నా దేవి (34) చెల్లెలు నాగమణి (32), తమ్ముడు దుర్గారావు (30) గా గుర్తించారు. గత నెల 31న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఊపిరితిత్తుల వ్యాధితో చికిత్సపొందుతూ మృతుల తల్లి మరణించగా… అంత్యక్రియల అనంతరం తండ్రిని ఇంటికి పంపి గోదావరిలో దూకారు అక్కాచెళ్లెల్లు, తమ్ముడు. అయితే ఈనెల ఒకటిన రాజమండ్రి ఇసుక ర్యాంప్ వద్ద గోదావరిలో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మూడు రోజులు మార్చురీలో ఉన్న మృతదేహాల వద్దకు ఎవరూ రాకపోవడంతో రాజమండ్రి వన్ టౌన్ పోలీసులే ఖననం చేసారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-